You are here

Back to top

नाट्य मंजरी की कहानी (నాట&#314 (Paperback)

नाट्य मंजरी की कहानी (నాటĺ Cover Image
$100.00
Usually Ships in 1-5 Days

Description


నాట్య మంజరి కథా సారాంశం ఈ కాలంలో మనకి అన్నీ సౌకర్యాలతోపాటు, ఎటువంటి జీవితాన్నైనా ఎంచుకో గలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేకరకాల ప్రలోభాలున్నాయి. ఆకర్షణలు ఉన్నాయి. డబ్బు రాబడి వుంది. ఏ జీవితానికైనా అలవాటుపడవచ్చు. కళలు నేర్చుకోవడానికి అవకాశాలు అందిపుచ్చుకోవటానికి అవకాశాలు మెండు. మనచుట్టూ పెద్దలు, తల్లితండ్రులు, అందరూ ఉన్నాకూడా, యువత అహంకారానికి దురభిమానానికి బానిసై అందమైన జీవితాలని ఆనందంగా మలచుకోలేక బాధలు కొనితెచ్చుకుంటున్నారు. ఆలోచించకుండా, కేవలం డబ్బు సంపాదనతో అన్నీ తమకాళ్ళ దగ్గరికి వస్తాయి, అందరూ దాసోహమవుతారన్న భావన ఎక్కువవటంతో పెద్దా చిన్నా అనే గౌరవంలేకుండా అహంకారంతో, తల్లితండ్రులను కూడా చిన్నచూపు చూస్తూ, మాట వినకుండా, సంసారాలు పాడు చేసుకుంటున్నారు. తమకు పుట్టిన పిల్లల భవిష్యత్తు కూడా కాలరాస్తున్నారు. అన్నీ ఉండి ఏమీ లేకుండా జీవితం నిస్సారంగా గడుపుతున్నారు. విశాల దృక్పధంతో, విజ్ఞత కలిగి, పెద్దవారి సహాయ సహకారాలతో పాటుగా, వారి జీవిత భాగస్వాములను పరస్పరం గౌరవించు కుంటూ స్నేహితులవలె మెలిగితే, జీవితం ఆనందమయంగా, అనురాగమయం అవుతుంది. పై విషయాలకి సంబంధించిన ఒక మంచి కథ "నాట్య మంజరి", ప్రేక్షకులు చదివి (ఈ కథా పుస్తకం ప్రచురణలో ఉన్నది), రచయితను మరి మరి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ "నాట్య మంజరి" కథ సినిమా తీయుటకు ప్రొడ్యూసర్లు/డైరెక్టర్లు ముందుకు వచ్చినచో వారికి ముందే ధన్యవాదములు, అభినందనలు తెలుపుతున్నాను. మంత్రి ప్రగడ మార్కండేయులు, Litt.D., కథా రచయిత హైదరాబాద్, ఇండియా +91-9951038802.

Product Details
ISBN: 9789356753730
ISBN-10: 9356753733
Publisher: Writat
Publication Date: January 12th, 2023
Pages: 252
Language: Telugu